Wednesday, March 14, 2012

గుండె వెలుగూ గౌతముడే.. - శక్తి

దేవుడే లేడన్న దేవుడు ఎవరే
మనిషే దేవుడన్న మహనీయుడెవరే
గుండె వెలుగూ గౌతముడే..
బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..                                              

దుఃఖించే లోకాన ఓదార్పు తానే
కోరికను గెలిచే తపస్సు తానే..                             
గుండె వెలుగూ గౌతముడే..
బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..      

కారణం లేకుండా జరగదు ఏదీ..
అది తెలుసుకుంటే జ్ఞానమే నీదీ..
గుండె వెలుగూ గౌతముడే..
బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..      

నిన్న నేడు రేపు ప్రతి క్షణము మార్పు
తుది మొదలు లేనిది కాలమన్నాడే..                     
గుండె వెలుగూ గౌతముడే..
బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..      

హింసపై మోహాన్ని వదిలేయమన్నా..
స్నేహంతో శాంతిని సాధించమన్నా..                      
గుండె వెలుగూ గౌతముడే..
బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..      

సోమరి తనము చావుకు వరము
శ్రమ జేసే మనిషికి చావు లేదన్నా..                       
గుండె వెలుగూ గౌతముడే..
బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..      


బహుజనుల హితము బహుజనుల సుఖము
కులమన్నదే లేని మతము మనదన్నా..         
గుండె వెలుగూ గౌతముడే..
బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..      

అష్టాంగమార్గాన దీక్షనే ఇచ్చి..
స్త్రీ పురుషులంతా సమానమన్నా..                
గుండె వెలుగూ గౌతముడే..
బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..      

జ్ఞానాన్ని పంచి మంచినే పెంచి
గుండెలో చెడునంత కడిగేయమన్నా..                     
గుండె వెలుగూ గౌతముడే..
బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..      

దేవుడే చెప్పినా.. నేను చెప్పినా..
రుజువు కాని మాట నిజము కాదండే..           
గుండె వెలుగూ గౌతముడే..
బుద్ధి సిద్ధి బుద్ధుడేలే..      


No comments:

Post a Comment